News Trending News Political

మరోసారి మోసం చేయడానికా… సిద్ధం ?

తుని పట్టణంలో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభలో ఏపీ కాంగ్రెస్‌ కమిటీ చీఫ్ వైఎస్ షర్మిళ మాట్లాడుతూ ఘాటు విమర్శలు చేశారు.

తుని వస్తుంటే ఒక ఆన్న తో మాట్లాడా… వాన వస్తె అంతా వరదే అన్నాడు. వైఎస్సార్ ఉన్నప్పుడు తాండవ నదికి రిటైనింగ్ వాల్ కడతా అని హామీ ఇచ్చారట.. వైఎస్సార్ చనిపోయాక వాల్ సంగతి మరిచారు అని ఆ ఆన్న చెప్పాడు. బాబూ కట్టలేదు… మీ ఆన్న జగన్ కట్టలేదు అన్నారు.

దివిస్ పరిశ్రమను జగన్ మోహన్ రెడ్డి బంగాళాఖాతం లో కలుపుతా అన్నాడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉద్యమాలు చేశాడు, ముఖ్యమంత్రి అయ్యాక…ఆ పరిశ్రమను దగ్గరుండి అనుమతి ఇచ్చాడట… ఆందోళనలు జరుగుతున్న పట్టింపు లేదు.

స్థానిక మంత్రి దాడి శెట్టి రాజ… చెయ్యని దందా లేదు, ఈయన ఇసుక వ్యాపారంలో రాజా, గుట్కా వ్యాపారంలో రారాజు, లిక్కర్ ను బయట నుంచి తెచ్చి డబుల్ రేట్లకు అమ్ముతున్నడట. ఈయన పేరు దాడిషెట్టి రాజ కాదట…”అనుభవించు రాజ” అంట కదా… మందు,పేకాట లేకుండా ఉండడట కదా… అలా ఉంది ఈ మంత్రి గారి తీరు.

ఈ 10 ఏళ్లలో రాష్ట్రంలో చెప్పుకొనే అభివృద్ధి లేనే లేదు. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారు… బాబు అమరావతి పేరు చెప్పి 3D గ్రాఫిక్స్ చూపించారు. జగన్ ఆన్న 3 రాజధానులు అని కాలయాపన చేశాడు, ఏ రాజధాని లేకుండా పోయింది. బీజేపీ రాష్ట్రానికి అన్యాయం చేస్తే… బాబు, జగన్ దోస్తీ చేస్తున్నారు. రెండు పార్టీలు బీజేపీతో పొత్తుకు పోటీ పడుతున్నాయి. రాష్ట్ర హక్కులు బీజేపీ కాలరాస్తుంటే… వైఎస్‌ఆర్‌సీపీ భజన చేస్తుంది. అసెంబ్లీలో నిలబడి బీజేపీ తో సఖ్యత ఉందని చెప్పుకుంటున్నారు.

విభజన హామీలు అన్ని వచ్చాయట… ఎక్కడ వచ్చాయి హామీలు ? హోదా ఎక్కడ.? పోలవరం ఎక్కడ ? ప్రత్యేక ప్యాకేజీలు ఎక్కడ ?. కలలు కంటూ అవే నిజాలు అని అసెంబ్లీలో నిలబడి అబద్ధాలు చెప్తున్నారు. కేంద్రం మనకు10 లక్షల కోట్లు ఇవ్వాల్సి ఉంది. నిధులు ఎక్కడ వచ్చాయో వైసీపీ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. బాబు సైతం రాష్ట్ర హక్కుల కోసం పోరాటం చేయడం లేదు. రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే… కేంద్రం చేసిన మోసాలపై నోరు ఎత్తడం లేదు, ఎందుకు సార్ మీ 40 ఏళ్ల అనుభవం.

వారిద్దరికీ బీజేపీ కావాలి… అందుకే డ్యూయెట్లు పాడుకుంటున్నారు. రాష్ట్ర ప్రయోజనాలు బీజేపీ దగ్గర తాకట్టు పెట్టారు, బాబు వెళ్లి బీజేపీ వాళ్ళ కాళ్ళు మొక్కుతున్నారు. జగన్ వెళ్లి వంగి వంగి దండాలు పెడుతున్నారు. బీజేపీతో సఖ్యత ఉంటే… మన రాష్ట్ర హామీలు ఎందుకు అమలు కాలేదు?. ఏటా జాబ్ క్యాలెండర్ లు లేవు, సంక్రాంతికి పట్టుబట్టలు కట్టుకొని పండుగ చేసుకొనే మీరు నిరుద్యోగుల గురించి మాట్లాడతారా..? నిరుద్యోగుల మీద చిత్తశుద్ది ఉంటే ..ఎందుకు ఇవ్వలే నోటిఫికేషన్ లు?

రైతుల పై జగన్ కు చిత్తశుద్ది లేదు. రాష్ట్రంలో రైతులకు నష్ట పరిహారం లేదు… సబ్సిడీలు లేవు. మద్య నిషేధం అని చెప్పి…పూర్తిగా కల్తీ మద్యం అమ్ముతున్నారు. కల్తీ మందు తాగి 25 శాతం అదనంగా మరణాలు జరుగుతున్నాయి. రాష్ట్రాన్ని 8లక్షల కోట్ల అప్పుల్లో ముంచారు. బటన్ నొక్కడానికి అప్పులు చేశారట… బటన్ నొక్కడానికే 8 లక్షల కోట్ల అప్పులా? అప్పు చేసి పప్పు కూడులా ఉంది జగన్ సర్కార్ పరిస్థితి.

రాష్ట్ర అభివృద్ధి, పాలన చేతకాదు కానీ…జగన్ ఆన్న సిద్ధం అట. ఎందుకు సిద్ధమో ఆయనకే తెలియదు. ప్రజలను దగా చేయడానికి సిద్ధమా ? హోదా అని చెప్పి మోసం చేయడానికి సిద్ధమా ? ఉద్యోగాలు అని మోసం చేయడానికి సిద్ధమా ? మద్య నిషేధం అని మోసం చేయడానికి సిద్ధమా ? మీరు సిద్ధం అయితే…ప్రజలు మిమ్నల్ని ఇంటికి పంపడానికి సిద్ధం.

ఈ ఎన్నికల్లో ఎవరు ఎన్ని డబ్బులు ఇచ్చినా తీసుకోండి… ఇసుక మాఫియా ద్వారా దోచుకున్న డబ్బే అది. తీసుకొని ఎవరికి ఓటు వేయాలో ఆలోచన చేసి వేయండని ఏపీ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిళ వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వాన్ని తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు.

Avatar

Spy News

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.