Education / Career

మాతృ భాషకు ప్రాధాన్యత ఇవ్వాలి…

WhatsApp Image 2023-12-11 at 4.16.52 PM

సామర్లకోటలో గవర్నమెంట్ హై స్కూల్లో ప్రసిద్ధ జాతీయ కవి సుబ్రహ్మణ్య భారతి జయంతినో నిర్వహించారు. ఈ కార్యాక్రమానికి జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత స్ధానిక బచ్చు ఫౌండేషన్ మునిసిపల్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు తోటకూర సాయి రామకృష్ణ ముఖ్య అతిధిగా విచ్చేశారు. ఈ సందంర్బంగా అయన మాట్లాడుతూ… విద్యార్థి దశ నుంచే ప్రతి ఒక్కరూ మాతృ భాషకు ప్రాధాన్యతనిచ్చి భాషలో నైపుణ్యం సాధించాలని దానితో పాటు భారతీయ భాషలలోని ఔన్నత్యాన్ని గుర్తించి గౌరవించాలని అన్నారు.

తద్వారా భాషా సమైక్యత, దేశ సమగ్రత వీలవుతుందని ఆయన అన్నారు. సుబ్రహ్మణ్య భారతి దేశానికి సాహిత్యానికి చేసిన కృషిని అక్కడున్న విద్యార్దులకు వివరించారు. ఆయన రాసిన రచనలు గురించి వివరించారు. విద్యార్థులతో తమిళం, ఒరియా, హిందీ, తెలుగు, మలయాళం, కన్నడ తదితర పదాలను, సామెతలను చదివించారు. 22 జాతీయ భాషల ప్రదర్శన చేశారు. అనంతరం విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమం లో భాషా ఉపాద్యాయులు బి. లక్ష్మి, పి.ఏ.ఎస్. లక్ష్మి, జి. బేబీ రాణి, కే. శ్రీనివాస్, వి. రాజు తదితర ఉపాద్యాయులు పాల్గొన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

WhatsApp Image 2023-10-12 at 5.50.59 PM
Education / Career

ఆదిత్య కు అవార్డులు..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ విభాగం ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహించిన రసస్వాద ఎడ్యుకేషనల్ ఎక్సలెన్స్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో నాక్ ‘ఏ ప్లస్ ప్లస్’ గుర్తింపుపొందిన తమ
sch
Education / Career

14 నుంచి పాఠశాలలకు దసరా సెలవులు…

జిల్లాలోని అన్ని పాఠశాలలకు ఈనెల 14వ తేదీ నుంచి 24వ తేదీ వరకు దసరా సెలవులు ప్రకటించినట్టు మండల విద్యాశాఖాధికారి వై శివరామ కృష్ణయ్య తెలిపారు. ఆయన