Political

మాదేపల్లి శ్రీనివాసుకు జనసేన పార్టీ భారీ షాక్…

OIP (9)

మాదేపల్లి శ్రీనివాసుకు జనసేన పార్టీ భారీ షాక్ ఇచ్చింది. అనేకసార్లు హెచ్చరించినప్పటికీ కూటమి పొత్తు ధర్మానికి విరుద్ధంగా తెలుగు దేశం పార్టీ శ్రేణుల మనోభావాలు దెబ్బ తీసేలా మాదేపల్లి శ్రీనివాసు ప్రవర్తించారు. దీని కారణంగా, అదే విధంగా జనసేన నాయకత్వంతో, పార్టీ శ్రేణులతో అనుచితంగా ప్రవర్తిస్తున్న కారణంగా ఆయనను జనసేన పార్టీ నుండి తాత్కాలికంగా సస్పెండ్ చేస్తున్నట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి కె. నాగబాబు తెలిపారు. వచ్చిన ఆరోపణలకు రానున్న రెండు వారాల్లో లిఖిత పూర్వకంగా సంజాయిషీకి అనుగుణంగా పార్టీ నుంచి తదుపరి చర్యలు ఉంటాయని అన్నారు. అప్పటి వరకూ ఆయనను పిఠాపురం నియోజకవర్గంలో జరిగే పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంచాలని పార్టీ నిర్ణయం తీసుకున్నట్లు తెలపారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.