News Trending News

“రంగానాడు” కులమతరాజకీయాలకు అతీతం

కులమత రాజకీయాలకు అతీతంగా అన్ని సామాజిక వర్గాల సమన్వయంతో, సేవా స్ఫూర్తి లక్ష్యంగా రంగానాడు ఆవిర్భావం జరిగిందని రాధా రంగా రాయల్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు మంచాల సుధాకర్ నాయుడు పేర్కొన్నారు. కాకినాడ జీఆర్‌టీ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అసోసియేషన్ అధ్యక్షుడు గాదే బాలాజీ మాట్లాడుతూ దివంగత వంగవీటి రంగ తాడిత పీడిత వర్గాల్లో ఆత్మస్థైర్యం నింపారన్నారు. విజయవాడ మాజీ ఎమ్మెల్యేగా, మహా నాయకుడిగా ఎదిగిన వంగవీటి మోహన్ రంగ సమాజంలో అన్ని సామాజిక వర్గాలకు ఎనలేని సేవలు అందించి నేటికీ పేదల గుండెల్లో స్థిర స్థానాన్ని సంపాదించుకున్నారన్నారు.

ఆయన అభిమానులుగా రంగ ఆశయాల సాధన దిశగా రాధా రంగ అసోసియేషన్ ఏర్పాటు చేసి గత పది సంవత్సరాలగా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో జయంతి వర్ధంతి కార్యక్రమంలో నిర్వహిస్తూ సామాజిక కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమాల లో భాగంగానే వంగవీటి మోహన్రంగా 36వ వర్ధంతి కార్యక్రమాన్ని కాకినాడ జిల్లాలో నిర్వహించేందుకు శ్రీకారం చెప్పడం జరిగిందన్నారు. ఈ వర్ధంతి కార్యక్రమంలో ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల నుండి అధిక సంఖ్యలో వివిధ సామాజిక వర్గాలకు చెందిన ప్రముఖులు, ప్రజా సంఘాల నేతలు, స్వచ్ఛందంగా హాజరవుతున్నట్లు తెలిపారు.

కాకినాడలో నిర్వహించే రంగనాడు కార్యక్రమానికి కన్వీనర్ గా మొలకల చంటి బాబుకు బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు ఈ సందర్భంగా మొలకల చంటిబాబు మాట్లాడుతూ సుమారు రెండు లక్షల రంగా అభిమానులు ఈ కార్యక్రమానికి హాజరయ్యే విధంగా సమీకరణలు, కార్యాచరణ చేపడుతున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో దళిత నాయకులు బచ్చల కామేశ్వరరావు, ధర్మసేన పార్టీ వ్యవస్థాపకులు జన పాముల నాగబాబు, గాదంశెట్టి కొండలరావు, రాజారపు మహేష్, తుమ్మల మూర్తి, ఎర్రం శెట్టి రామరాజు, సలాది శ్రీనివాస బాబా తదితరులు పాల్గొన్నారు.

Avatar

Spy News

About Author

You may also like

WhatsApp Image 2023-10-13 at 7.19.11 PM
News

కారుణ్య నియామకం లో ముగ్గురికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేసిన జిల్లా కలెక్టర్…

  ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తూ వివిధ కారణాలతో మరణించిన ‌ముగ్గురు ఉద్యోగుల కుటుంబీకులకు కాకినాడ కలెక్టరేట్ స్పందన హాలులో జిల్లా కలెక్టర్ డా.
News Andhra Pradesh Political Anakapalli Srikakulam Visakhapatanam

ముఖ్యమంత్రి YS జగన్‌ అక్టోబర్‌ 16న విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల పర్యటన

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మెహన్‌ రెడ్డి అక్టోబరు 16న విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో పర్యటించనున్నారు. ఇందుకు సంబంధించిన ప్రోగ్రామ్‌ షెడ్యూల్‌ను ప్రభుత్వం జారీ చేసింది. ఉదయం