Future

రాజమహేద్రవరంలో ఈ నెల 15న మినీ జాబ్ మేళ…

OIP

తూర్పు గోదావరి జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో ఫిబ్రవరి 15 వ తేదీన మినీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి కే. హరిచంద్ర ప్రసాద్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం ఉదయం 10 గంటల నుంచి హెటిరో డ్రగ్స్ కంపెనీ జూనియర్ కెమిస్ట్, ఆఫీసర్/కెమిస్ట్, ఇంజనీర్, సూపెర్వైజర్ పోస్టుల భర్తీ కొరకు రాజమహేంద్రవరంలో షెల్టన్ హోటల్ సమీపంలో, హేచ్.పీ. పెట్రోల్ పంప్ వెనుక  జిల్లా ఉపాధి కార్యాలయం నందు ఇంటర్వూలు నిర్వహిస్తామని తెలిపారు.

ఎంపికైన అభ్యర్థులు నక్కపల్లి, విశాఖపట్నం ప్రాంతాలలో పనిచేయాల్సి ఉంటుందన్నారు. ఇంటర్వూలకు 2020, 2021, 2022, 2023 సంవత్సరం లో ఉతీర్ణలైన బిఎస్సీ కెమిస్ట్రీ, ఎంఎస్సీ ఆర్గానిక్/అనలిటికల్, బి ఫార్మసీ, బి.టెక్ కెమికల్, డిప్లొమా మెకానికల్ వరకు చదువుకున్న 19-26 సం.ల వయసు గల నిరుద్యోగ యువకులు మాత్రమే అర్హులని వెళ్లడించారు.

ఎంపికైన అభ్యర్థులకు వార్షిక జీతం రు. 2.35 లక్షలు నుంచి రూ.3 లక్షలు ఉంటుందని తెలిపారు. మరింత సమాచారం , సహాయం కొరకు 8247437773 నెంబర్ సంప్రదించగలరనీ తెలియ జేశారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

R
Future

రేపు వారి ఖాతాల్లో డబ్బులు జమ…

ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రి వై.ఎస్‌. జగన్‌ మోహన్ రెడ్డి అనంతపురం జిల్లా ఉరవకొండను 23-01-2024 తేదీన పర్యటించనున్నట్లు తెలిపారు. పర్యటనలో భాగంగా వైఎస్సార్‌ ఆసరా
WhatsApp Image 2024-01-22 at 9.07.50 PM
Future

సనాతన ధర్మ విశిష్టతను చాటిన క్షణాలివి… -పవన్ కళ్యాణ్-

అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం కోసం, ఆలయంలో శ్రీ బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం కోసం ఆదివారమే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అయోధ్య