Political

రేపు పిఠాపురంలో మెగా హీరో ఎన్నికల ప్రచారం…

f9eedddb-6b9e-46f2-ae7b-b3e605cd7616

జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పోటీ చేస్తోన్న పిఠాపురం నియోజకవర్గంలో ప్రముఖ సినీ హీరో, మెగా ప్రిన్స్ కొణిదెల వరుణ్ తేజ్ శనివారం ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నట్లు తెలిపారు. చేబ్రోలు పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జనసేన పార్టీ జాతీయ మీడియా అధికార ప్రతినిధి వేములపాటి అజయ్ కుమార్ మాట్లాడుతూ… వరుణ్ తేజ్ ఎన్నికల ప్రచారానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు.

గొల్లప్రోలు రూరల్ మండలం తాటిపర్తిలో మధ్యాహ్నం 3 గంటలకు ప్రచారం మొదలు పెట్టి వన్నెపూడి మీదుగా కొడవలి, చందుర్తి మీదుగా దుర్గాడ చేరుకుంటారని చెప్పారు. ఎన్నికల ప్రచార ర్యాలీ, రోడ్ షో, సమావేశాల్లో ఆయన ప్రసంగిస్తారని తెలిపారు. జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ శ్రేణులు, పిఠాపురం నియోజకవర్గం ప్రజలు ఈ ఎన్నికల ప్రచారంలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.