Political

వామ పక్షాళపై ప్రభుత్వ నిర్బంధం తగదు..

WhatsApp Image 2023-10-12 at 6.37.24 PM

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గురువారం ఉదయం ఏఐటీయూసీ ముఖ్య నాయకుల సమావేశం జిల్లా కన్వీనర్ కుండ్రపు రాంబాబు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు రావులపల్లి రవీంద్రనాథ్, రాష్ట్ర కోశాధికారి బీ.వీ. వి.కొండలరావు, హాజరయ్యారు. ఈ సందర్భంగా రావులపల్లి రవీంద్రనాథ్ మాట్లాడుతూ కార్మికుల ఉద్యమాలపై పోలీసులు నిర్బంధాలు తగదని, ఈ మధ్యకాలంలో అక్రమ అరెస్టులు ముందస్తుగా నిర్బంధాలు ఎక్కువ అయ్యాయని అవి తక్షణం మానుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

సామర్లకోటలో సీఎం మీటింగ్ అంగన్వాడీలను, ఆశా వర్కర్లను, ఆటో కార్మికులను, డ్వాక్రా మహిళలను బెదిరించి భయపెట్టి సీఎం మీటింగ్ కి రాకపోతే ప్రభుత్వ సంక్షేమ పథకాలు కోల్పోతారని చెప్పడం ఈ ప్రభుత్వం పతనానికే ఇది నిదర్శమని, వైయస్సార్ రాజకీయ పార్టీ ప్రచార, ఆర్భాటాల సమావేశాలకు పార్టీ కార్యకర్తలను, సభ్యులు పిలవలే తప్ప కార్మికులను బెదిరించి పిలిపించడం, ప్రజలను ఇబ్బంది పెట్టడం ప్రజల గమనిస్తున్నారు తగిన గుణపాఠం తెలియచేస్తారని, ఈ రాష్ట్ర ప్రభుత్వం రోజుకి పెంచుతున్న నిత్యవసర అధిక ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు 26 వేల రూపాయలు అమలు చేయాలని, కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలని, అంగన్వాడి, ఆశ, మధ్యాహ్నం భోజన పథకాల స్కీం కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, ఆటో, హమాలీ, వీధివిక్రయదారులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ద్వారా సంక్షేమ పథకాలు అమలు చేయాలని, ఆందోళన చేస్తున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకుండా సీఎం మీటింగ్లకి పిలవడం రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గు ఉందా అని ఆయన ఈ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.