News Crime National

విజయనగరంలో రెండు రైళ్లు ఢీకొని 12 మంది మృతి

  • విశాఖ, విజయనగరం హాస్పిటల్స్‌లో చికిత్స పొందుతున్న 50 మంది క్షతగాత్రులు

విజయనగరం జిల్లాకొత్తవలస మండలం కంటకాపల్లి వద్ద రెండు రైళ్లు ఢీకొన్న ప్రమాదంలో 12 మంది మృతిచెందిగా 50 మంది చికిత్స పొందుతున్నట్టు అదికారులు వెల్లడించారు. గుంటూరు – రాయగడ ఎక్స్‌ప్రెస్‌, పలాస – విశాఖ డిఎంయు రైలు ఢీకొనగా నాలుగు బోగీలు పట్టాలు తప్పాయి. ఈ పరిణామంతో ప్రయాణీకులు ఆర్తనాదాలు హాహాకారాలతో పరుగుతు తీశారు. రైల్వే, పోలీస్‌ అధికారులు హుఠాహుటిన సహాయక చర్యలు చేపట్టారు. ఎన్‌డిఆర్‌ఎఫ్‌, అగ్నిమాపక బృందాలు రంగంలోనికి దిగాయి. బాదితులు, క్షతగాత్రుల సమాచారం కోసం విజయనగరం కలెక్టర్‌ కార్యాలయంలో హెల్ప్‌డెస్క్‌, కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేశారు. కలెక్టర్‌ ఎస్‌ నాగలక్ష్మి, జిల్లా ఎస్పీ దీపికా ఎం పాఠిల్‌, విజయనగరం ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ అనిలా సుందరి, విశాఖపట్నం జిల్లా కలెక్టర్‌ మల్లికార్జున సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.

రైల్వే ప్రమాద సంఘటనపై ప్రదాన మంత్రి మోదీ, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంఘటనపై ఆరాతీసి తీవ్ర దిగ్బ్రాంతిని తెలియజేశారు. మృతులకు రూ.10లక్షలు, క్షతగాత్రులకు రూ.2 లక్షల చొప్పన పరిహారం ప్రకటించారు. సహాయక చర్యలను ముమ్మరం చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ప్రమాదం జరిగిన పిమ్మట ఇతర రైళ్లను మళ్లించారు. విద్యాశాఖా మంత్రి బొత్సా సత్యనారాయణ సంఘటనా ప్రాంతాన్ని సందర్శించి బాదిత కుటుంభాలను ఓదార్చారు.

Avatar

Spy News

About Author

You may also like

WhatsApp Image 2023-10-12 at 5.33.17 PM
Crime

ముమ్మడివరం మండలం అంబేద్కర్ జిల్లాలో తనిఖీలు చేసిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ బృందం..

విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ బృందం ముమ్మడివరం మండలము లోని శ్రీ తారకరామా ట్రేడర్స్ ఎరువుల షాపును తనిఖీ చేశారు. ఎరువుల నిల్వలను స్టాక్ రిజిస్టర్ ప్రకారం,
WhatsApp Image 2023-10-13 at 7.19.11 PM
News

కారుణ్య నియామకం లో ముగ్గురికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేసిన జిల్లా కలెక్టర్…

  ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తూ వివిధ కారణాలతో మరణించిన ‌ముగ్గురు ఉద్యోగుల కుటుంబీకులకు కాకినాడ కలెక్టరేట్ స్పందన హాలులో జిల్లా కలెక్టర్ డా.