Culture

విభూది శివలింగము…!!!

WhatsApp Image 2024-03-07 at 6.05.21 PM

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని కాకినాడకు చెందిన సూక్ష్మ కళాఖండల సృష్టికర్త ఆరిపాక రమేష్ బాబు విభూది తో అతి చిన్న శివలింగాన్ని చెక్కడమే కాకుండా రెండున్నర అంగుళాల ఎత్తు లో త్రిశులము ఒక సెంటి మీటరు పరిమాణము లో ఢమరుకం తయారు చేశారు. ఈ శివలింగం ఎత్తు 2.25 అంగుళాలు, వెడల్పు 1.25 అంగుళాలు మరియు బరువు 32 గ్రాములు అని రమేష్ తెలిపారు. శ్రీ విరాట్ పోతులూరి వీర బ్రేహ్మేంద్ర స్వామి వారు కడపజిల్లాలో స్వయంగా ప్రతిష్టించిన విభూది శివలింగం రోజు రోజుకు పెద్దది అవుతుండడం విషేశం అన్నారు.
ఇది ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన విషయం అని ప్రజలకు గుర్తు చేశారు. సాగర మధనంలో లోకాన్ని దహించే హాలహలం ప్రపంచాన్ని దహిస్తుంది అని సకల ప్రాణులను రక్షించడానికి మహా శివుడు ఆ హాలాహాలన్ని తన ఖంటములో ఉంచుకుని ప్రపంచాన్ని రక్షించి నీలఖంటుడు అయ్యాడని, శివరాత్రి పర్వదినo సందర్భముగా ప్రజలందరూ బాగుండాలని కోరుకుంటూ శివునికి అత్యంత ప్రీతి అయిన విభూది తో ఈ శివలింగాన్ని చెక్కడం జరిగింది అని రమేష్ తెలిపారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

News Culture Andhra Pradesh Political

భీమేశ్వర ఆలయంలో మంత్రి పినిపే విశ్వరూప్‌ పూజలు

సామర్లకోట భీమేశ్వర ఆలయంలో మంత్రి పినిపే విశ్వరూప్ ప్రత్యేక పూజలు చేశారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సతీ సమేతంగా ఆయన ఆలయానికి చేరుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు
News Culture Andhra Pradesh

అర్చకులకు దసరా కానుక

విజయదశమి సందర్భంగా అర్చకులకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుభవార్త చెప్పారు. 2019 ఎన్నికలో ఇచ్చిన హామీని నెరవేర్చారు. అందులో భాగంగా రాష్ట్రంలోని 26 జిల్లాల్లో 1,177 మంది