Kakinada

వివేకా పార్కు జవహర్ వీధి గేటు ప్రవేశం కల్పించాలి…

WhatsApp Image 2024-02-19 at 1.51.58 PM

కాకినాడ నగరంలో ఉన్న కుళాయి చెరువు ఆవరణలోని స్వామి వివేకానంద కాంస్య విగ్రహం జవహర్ వీధి గేటు వద్ద సీనియర్ సిటిజన్ ల సౌకర్యార్థం వివేకానంద పార్కు వేళల ప్రకారం ప్రవేశం కల్పించాలని పౌర సంక్షేమ సంఘం కోరింది. ఈ అంశంపై జిల్లా గ్రీవెన్స్ లో కలెక్టర్ కార్పోరేషన్ స్పెషల్ ఆఫీసర్ కృతిక్ శుక్లా కు పౌరసంఘం కన్వీనర్ దూసర్లపూడి రమణ రాజు వివిధ రాజకీయ పార్టీలు ప్రజా సంఘాల నుండి ప్రజల అభిప్రాయాలతో సంతకాలు సేకరించిన అఖిలపక్షం వినతి పత్రాన్ని అందజేశారు. క

రోనా లాక్ డౌన్ లో మూసి వేసిన జవహర్ వీధి గేటు తెరవక పోవడం వలన మోకాళ్ళ నొప్పులతో బాధపడే సీనియర్ సిటిజన్స్ చుట్టూ తిరిగి పార్కు లోకి వెళ్లి విశ్రాంతి పొందే అవకాశం భారం అవుతున్నదన్నారు. జవహర్ వీధి గేటు ప్రవేశం కల్పించడం వలన నేరుగా సేద తీరి త్వరగా గృహాలకు చేరే అవకాశం వుంటుందన్నారు. అందుకు కలెక్టర్ సానుకూలంగా స్పందిస్తూ కమీషనర్ కు తెలిపి పార్కు ప్రవేశం కల్పిస్తామన్నారని ఆయన తెలిపారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

WhatsApp Image 2023-10-20 at 4.43.33 PM
Kakinada

బాల్యవివాహాలను సమూలంగా నిర్మూలిద్దాం… నగరపాలక సంస్థ కమిషనర్ నాగ నరసింహారావు వెల్లడి…

బాల్య వివాహాల నిషేధిత చట్టం – 2006 ను మరింత పటిష్టవంతంగా అమలు చేయడంలో ఆయా ప్రభుత్వ శాఖలు సమన్వయంతో కృషి చేయాలని కాకినాడ నగరపాలక సంస్థ