నగరంలో టేస్టింగ్ సాల్ట్ (మోనో సోడియం గ్లూటమేట్) వినియోగించకుండా ఆహార తయారీ జరగడం లేదని విష తుల్యం చేసే ఆరోగ్యం పక్షవాతం దిశగా అనారోగ్యం కల్పించే పరిణామాలున్నాయని పౌర సంక్షేమ సంఘం పేర్కొంది. పలువురు వైద్యులు తెలుపుతున్నప్పటికీ ఆహారకల్తీ నిరంతరంగా జరుగుతున్న దుస్తితి వుందన్నా రు.
వంటల్లో రుచి కోసం టేస్టింగ్ సాల్ట్ ను హోటల్స్ రెస్టారెంట్లు ఫాస్ట్ ఫుడ్ బేకరీ ఆహారపదార్ధా ల్లో విందుభోజనాలు పలు పబ్లిక్ అన్నదానాల్లో వంట తయారీదారులు విరివిగావాడకం చేస్తున్నదుస్తితి అలవాటుగా మారిందన్నారు. ఇటువంటి ఆహారాలను నిరంతరం ఆరగించడం వలన ఆరోగ్యానికి హాని కలిగే దుష్పరిణామాల్లో ఊబకాయం మెటబాలిక్ మైగ్రేన్ హార్మోన్ల అసమతుల్యత ఛాతీ నొప్పి వంటి అవస్థలు ఏర్పడతాయన్న వైద్యుల సూచనల పట్ల అప్రమత్తత అవసరమన్నారు.
యధేచ్చగా మారిన ఆహారకల్తీపై చర్యలు లేవన్నారు. విష పదార్ధమైన టేస్టింగ్ సాల్ట్ అమ్మకాలు సరుకు సరఫరా జరగకుండా వంట పదార్థాల వినియోగంలో చేర్చకుండా వుండే చర్యల కోసం ప్రజారోగ్య విభాగం ఆహార తయారీదారులకు విక్రేతలకు హెచ్చరికలు చేయాలని పౌర సంఘం కన్వీనర్ దూసర్లపూడి రమణ రాజు కోరారు.