ఇప్పటి వరకూ నగదు దొంగతనం చేసేవాళ్లకోసం వినుంటారు. అదే విధంగా ఆభరణాలు, విలువైన వస్తువులు, బైకులు, పర్స్‌లు చోరీ చేసేవాళ్ల కోసం తెలుసుకునుంటారు. అయితే వీడు మాత్రం సెపరేటు…. అద్దెపేరుతో ఏకంగా కార్లతోనే ఉడాయించేస్తుంటాడు. సఖినేటిపల్లి మండలం అంతర్వేదిపాలెం గ్రామం ఉయ్యూరివారిమెరక కు చెందిన బీర క్రిష్ణంరాజు అనే వ్యక్తి తాను ఒక పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుడినని జనాన్ని నమ్మిస్తుంటాడు. OLX App లో ప్రకటన చూసి అమలాపురం పట్టణం సూర్య నగర్ కు చెందిన M.A. హైదర్ అను వ్యక్తిని సంప్రదించాడు. తనకు కారు అద్దెకు కావాలని బాలెనో కారును అద్దెకు తీసుకున్నాడు. నెల రోజుల పాటు అద్దెను చెల్లించగలిగాడు. అనంతరం ఫోన్‌కి స్పందించడంలేదు. బాదితుడు M.A. హైదర్ 29 అక్టోబర్ లో అమలాపురం పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. రంగంలోనికి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు. మరో నాలుగు కార్లు అపహరించినట్టు పోలీసుల విచారణలో నిందితుడు అంగీకరించాడు.
వీడు మామూలోడు కాదు…
![IMG-20231106-WA0035](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2023/11/IMG-20231106-WA0035.jpg?resize=1280%2C700&ssl=1)