News Crime Trending News

వైద్యుడి మృతికి భూ కబ్జే కారణమా..!

భూ క్రయ విక్రయాల్లో దస్తావేజులను తీసుకుని నగదు ముట్ట చెప్పే విషయంలో ఎదురు తిరిగడంతో తట్టుకోలేక మనస్థాపానికి గురైన భూ యజమాని డాక్టర్ కిరణ్ ఆత్మహత్యకు పాల్పడి విగతజీవిగా మారిన వైనం కాకినాడ రూరల్‌లో కలకలం రేపుతోంది. ఈ వ్యవహారంలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే సోదరుడు కళ్యాణ కృష్ణ పాత్ర కీలకంగా ఉందని మృతుని తల్లి శేషారత్నం ఆరోపిస్తున్నారు.

గొల్లప్రోలు మండలం చందుర్తి, కరప మండలం కోరాడ గ్రామంలో ఉన్న సుమారు 12 ఎకరాలకు సంబంధించి భూమిని డాక్టర్ నున్న కిరణ్ అమ్మకానికి పెట్టగా సామర్లకోట మండలం అచ్చంపేట గ్రామానికి చెందిన పెద్దబాబు మధ్యవర్తిగా లావాదేవీలు సాగిస్తున్న తరుణంలో పెదబాబుని నమ్మి భూమికి సంబంధించిన దస్తావేజులు అప్పగించినట్లు మృతుని తల్లి తెలిపారు.

తీరా దస్తావేజులు అప్పగించిన తరువాత డబ్బులు చెల్లించకుండా ఎదురు తిరగడంతో తమ కుమారుడు ఈ అఘాయిత్యానికి పాల్పడి తనను దిక్కులేని దానిని చేశారని ఆవేదన వ్యక్తంచేశారు. ఇప్పటికే తమకు చెందిన భూ విక్రయాల్లో రూరల్ ఎమ్మెల్యే కన్నబాబు ప్రధాన అనుచరుడు, ఆయన వ్యక్తిగత సలహాదారుడు గాలిదేవర బాలాజీ కూడా కూరాడ భూమి విక్రయంకు సంబంధించి డబ్బులు ఇవ్వకుండా తమ బిడ్డను ఇబ్బందులకు గురి చేయడం జరిగిందని తెలిపారు.

మొత్తం మీద కాకినాడ రూరల్ పరిధిలో జరుగుతున్న భూకబ్జాల పరంపరలో కన్నబాబు అనుహాయలు అకృత్యాలు వెలుగు చూస్తున్నాయి. కాగా ఈ వ్యవహారంపై కాకినాడ 2 టౌన్‌ సిఐ నాగేశ్వర్‌ నాయక్‌ మాట్లాడుతూ డాక్టర్‌ కిరణ్‌ ఆర్థిక సమస్యలతో మరణించినట్టు ఆయన తల్లి తెలియజేసిందన్నారు.
Avatar

Spy News

About Author

You may also like

WhatsApp Image 2023-10-12 at 5.33.17 PM
Crime

ముమ్మడివరం మండలం అంబేద్కర్ జిల్లాలో తనిఖీలు చేసిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ బృందం..

విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ బృందం ముమ్మడివరం మండలము లోని శ్రీ తారకరామా ట్రేడర్స్ ఎరువుల షాపును తనిఖీ చేశారు. ఎరువుల నిల్వలను స్టాక్ రిజిస్టర్ ప్రకారం,
WhatsApp Image 2023-10-13 at 7.19.11 PM
News

కారుణ్య నియామకం లో ముగ్గురికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేసిన జిల్లా కలెక్టర్…

  ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తూ వివిధ కారణాలతో మరణించిన ‌ముగ్గురు ఉద్యోగుల కుటుంబీకులకు కాకినాడ కలెక్టరేట్ స్పందన హాలులో జిల్లా కలెక్టర్ డా.