Kakinada

షాపింగ్ కాంప్లెక్స్ ప్రారంభోత్సవంలో ద్వారంపూడి…

WhatsApp Image 2024-02-28 at 10.35.45 AM

కాకినాడ సినిమా రోడ్డు సంత చెరువు కనకదుర్గమ్మ ఆలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి హాజరయ్యారు. ఇదే సందర్భంలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు వైకాపా నాయకులు జొన్నాడ చినబాబు తండ్రి జొన్నాడ సూర్య ప్రకాష జన్మదిన దినోత్సవాన్ని పురస్కరించుకుని భారీ ఎత్తున నూతన వస్త్రాల పంపిణీ చేసారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… కాకినాడ నగరంలో అత్యంత సుందరంగా నిర్మించిన రెండు దేవాలయాల నిర్మాణంలో జొన్నాడ చిన్నబాబు నిర్వర్తించిన బాధ్యత అభినందనీయమన్నారు. మూర్తి నగర్ వైభవ వెంకటేశ్వర స్వామి ఆలయం, సంత చెరువు కనకదుర్గమ్మ నూతన ఆలయం నిర్మాణాలు బాధ్యత తీసుకుని కేవలం 6 నెలల కాలంలో అత్యంత సుందరంగా రూపు దిద్దిన ఘనత జాన్నాడ చిన్నబాబుదే అన్నారు. ఈ కార్యక్రమంలో కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి సునీల్, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ నారాయణరావు, కాకినాడ వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్ పర్సన్ పసుపులేటి వెంకటలక్ష్మి, తదితరులు ఉన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

WhatsApp Image 2023-10-20 at 4.43.33 PM
Kakinada

బాల్యవివాహాలను సమూలంగా నిర్మూలిద్దాం… నగరపాలక సంస్థ కమిషనర్ నాగ నరసింహారావు వెల్లడి…

బాల్య వివాహాల నిషేధిత చట్టం – 2006 ను మరింత పటిష్టవంతంగా అమలు చేయడంలో ఆయా ప్రభుత్వ శాఖలు సమన్వయంతో కృషి చేయాలని కాకినాడ నగరపాలక సంస్థ