వికాస్ బహ్ల్ దర్శకత్వంలో అజయ్ దేవగన్, ఆర్ మాధవన్, జ్యోతిక, జాంకీ బోడివాలా మరియు ఆంగ్ రాజ్ నటించిన షైతాన్ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.100 కోట్ల మార్కును అధిగమించి బాక్సాఫీస్ విజయాన్ని సాధించింది. కొన్ని పోటీని ఎదుర్కొన్నప్పటికీ వాటన్నీటిని అదిగమించి ముందుకు కొనసాగుతుంది. నివేదికల ప్రకారం ఈ చిత్రం ఏడవ రోజు దేశీయంగా దాదాపు రూ. 5.75 కోట్లు వసూలు చేసింది. బాక్సాఫీస్ వద్ద విజయవంతమైన ఓపెనింగ్ తర్వాత ఈ చిత్రం ఈ వారపు రోజు వసూళ్లలో క్షీణతను చవిచూసింది. షైతాన్ చిత్రం మార్చి 14, 2024, గురువారం నాటికి మొత్తం 12.68 శాతం హిందీ ఆక్యుపెన్సీ తెచ్చుకుంది. ఇప్పటి వరకు ఈ సినిమా ఒక్క ఇండియాలోనే రూ.79.75 కోట్లు రాబట్టింది. ట్రేడ్ రిపోర్ట్స్ ప్రకారం.. ఈ సినిమా ఇప్పటికే అంతర్జాతీయ బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్ల మైలురాయిని దాటేసింది.
షైతాన్ బాక్స్ ఆఫీస్ 7వ రోజు కలెక్షన్ ఎంతంటే…!!!
![BB1jQXtQ](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2024/03/BB1jQXtQ.jpg?resize=768%2C432&ssl=1)