Kakinada

సమాచార హక్కు చట్టం-2005 పై అవగాహన సదస్సు…

WhatsApp Image 2024-01-28 at 7.10.18 PM

దేశానికి వెన్నెముకైన రైతులకు చట్టపరమైన పథకాలు అందించడంలో, సమాజంలో ఆడపిల్లలపై జరుగుతున్న ధాడులను ప్రాలద్రోలడంలో సమాచార హక్కు చట్టం న్యాయ పోరాట సమన్వయ కమిటీ కృషి చేస్తుందని సమన్వయ కమిటీ ఫౌండర్ కం చైర్మన్ కంచర్ల సురేష్ పేర్కొన్నారు. స్దానిక కొండయ్య పాలెంలో జాతీయ అద్యక్షులు బాలాజీ శంఖర్ సింగ్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయస్థాయి కార్యవర్గ సమావేశానికీ ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సమాచార హక్కు చట్టం-2005 పై అవగాహన సదస్సులు పలు రాష్ట్రాల్లో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కాకినాడ జిల్లాలో జాతీయ, రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామస్థాయి లో సమాచార హక్కు చట్టం గురించి అవగాహన కల్పిస్తూ అవినీతి లేని సమాజాన్ని ఏర్పాటు చేయాలన్నారు.

ప్రభుత్వ పథకాలు ప్రజల వద్దకు చేరాలని, పోలీసులకు-ప్రజలకు మధ్య సమాచార హక్కు చట్ట న్యాయ పోరాట సమన్వయ కమిటీ ఒక వారధిగా ఉంటుందని అన్నారు. అనంతరం కాకినాడ జిల్లా ఇన్ ఛార్జ్ గా అభిషిక్త్ రోజ్ ను నియమిస్తున్నట్లు ఆ కమిటీ జాతీయ అధ్యక్షులు బాలాజీ శంకర్ సింగ్ నియామక ఉత్తర్వులను అందజేశారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

WhatsApp Image 2023-10-20 at 4.43.33 PM
Kakinada

బాల్యవివాహాలను సమూలంగా నిర్మూలిద్దాం… నగరపాలక సంస్థ కమిషనర్ నాగ నరసింహారావు వెల్లడి…

బాల్య వివాహాల నిషేధిత చట్టం – 2006 ను మరింత పటిష్టవంతంగా అమలు చేయడంలో ఆయా ప్రభుత్వ శాఖలు సమన్వయంతో కృషి చేయాలని కాకినాడ నగరపాలక సంస్థ