బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ నివాసం వెలుపల కాల్పులు జరిపిన కేసులో ఐదో నిందితుడిని ముంబై పోలీస్ క్రైమ్ బ్రాంచ్ అరెస్టు చేసింది. మహ్మద్ చౌదరి అనే నిందితుడిని రాజస్థాన్‌లో అదుపులోకి తీసుకున్నట్లు తెలిపింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం… చౌదరి ఇద్దరు షూటర్లు సాగర్ పాల్, విక్కీ గుప్తాలకు డబ్బు అందించారు. ముంబైలోని బాంద్రా ప్రాంతంలో ఉన్న నటుడి నివాసం గెలాక్సీ అపార్ట్మెంట్లో రెక్సీని నిర్వహించాలని కూడా ఆదేశించాడు.
చౌదరిని ఈరోజు ముంబైకి తీసుకువస్తున్నామని, తర్వాత కోర్టులో హాజరు పరుస్తామని తెలిపారు. అక్కడ అతనిని కస్టడీకి డిమాండ్ చేస్తామని క్రైమ్ బ్రాంచ్ తెలిపింది. గతంలో సాగర్ పాల్, విక్కీ గుప్తాలను ముంబై పోలీసులు గుజరాత్‌లోని భుజ్‌లో అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు నిందితులు సోను సుభాష్ చందర్, అనుజ్ థాపన్ కూడా గత నెల చివర్లో అరెస్టయ్యారు.