Weather

సహాయక చర్యల్లో లోపం తలెత్తకుండా చూడండి

R (3)
  • సిఎం వై.ఎస్. జగన్

బంగాళాఖాతంలో నెలకొన్న తీవ్రవాయుగుండం తుపానుగా మారుతున్న దృష్ట్యా అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ ఆదేశించారు. తుపాను పరిస్థితులపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈనెల 4 వ తేదీన ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు, మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉందని, అది ఉత్తర దిశగా ప్రయాణించే అవకాశాలున్నాయని అధికారులు సీ.ఎం. కు తెలియజేశారు. సహాయ పునరావాస కార్యక్రమాలు చేపట్టడానికి ప్రభావిత జిల్లాల కలెక్టర్లు సర్వసన్నద్ధంగా ఉండాలన్నారు. కరెంటు, రవాణా వ్యవస్థలకు అంతరాయాలు ఏర్పడితే వెంటనే వాటిని పునరుద్ధరించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. సీఎం ఆదేశాల మేరకు 8 జిల్లాలకు ముందస్తుగా ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. అందులో తిరుపతి జిల్లాకు రూ.2 కోట్లు, SPSR నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, కృష్ణా, ప.గో, డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ కోనసీమ, కాకినాడ జిల్లాలకు రూ.1 కోటి చొప్పున విడుదలచేశారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

Weather

Friday’s Weather

Friday’s Weather Forecast : The maximum temperature starts from morning 9AM and that to of 29°C, reaches high at 1PM that