Kakinada

సామర్లకోటలో దారుణ ఘటన…

Honey-bee-1-659x330

కాకినాడ జిల్లాలోని సామర్లకోట పట్టణంలో ధారుణ ఘటన జరిగింది. స్థానిక ప్రజలకు మునిసిపాలిటి వాటర్ సిబ్బందిపై తేనెటీగలు దాడి చేసాయి. ఈ దాడిలో అక్కడ పనిచేస్తున్న నలుగురితేనెటీగలు దాడిచేయడంతో వారిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు. భాదితులు తెలిపిన వివరాల ప్రకారం పట్టణ ప్రజలకు సరఫరా జరిగే త్రాగునీటి పైప్ లైన్ లో అంతరాయం ఎర్పడటంతో దానిని సరిచేసే సమయంలో వాటర్ వర్క్స్ ఇన్చార్జి గిడుతూరి శ్రీనువాసరావు, ఎన్. రత్నరాజు, కె. సత్యనారాయణ, రొట్టా ప్రసాద్ లపై తేనెటీగలు దాడి చేసాయి. తీవ్ర అశ్వస్థతకు గురైన వారిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. క్షతగాత్రులను మునిసిపల్ చైర్ పర్సన్ గంగిరెడ్డి అరుణ, వైస్ చైర్మన్ ఊబా జాన్ మోజెస్, మునిసిపల్ కౌన్సిలర్ నేతల హరిబాబు, తదితరులు పరామర్శించారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

WhatsApp Image 2023-10-20 at 4.43.33 PM
Kakinada

బాల్యవివాహాలను సమూలంగా నిర్మూలిద్దాం… నగరపాలక సంస్థ కమిషనర్ నాగ నరసింహారావు వెల్లడి…

బాల్య వివాహాల నిషేధిత చట్టం – 2006 ను మరింత పటిష్టవంతంగా అమలు చేయడంలో ఆయా ప్రభుత్వ శాఖలు సమన్వయంతో కృషి చేయాలని కాకినాడ నగరపాలక సంస్థ