Political

సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయనున్న రిపబ్లికన్ పార్టీ…

WhatsApp Image 2024-03-20 at 4.41.04 PM

సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ నుండి 25 అసెంబ్లీ స్థానాల్లో ఏడు పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయనున్నట్లు రిపబ్లికన్ పార్టీ ఇండియా రాష్ట్ర కార్యవర్గం తెలిపింది‌. బుధవారం విజయవాడ సీతారాంపురం లో గల పార్టీ కార్యాలయంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మేకా వెంకటేశ్వర అధ్యక్షతన రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఎన్నికల ఇంచార్జ్ దక్షిణాది రాష్ట్రాల అధ్యక్షులు పి. అంజయ్య హాజరయ్యారు.

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ స్థాపించిన రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా నుండి ఆసక్తి కలిగి పోటీ చేసే అభ్యర్ధుల నుండి దరఖాస్తులు తీసుకొని వారికి దిశ నిర్దేశం చేశారు. ఇప్పటివరకు 25 అసెంబ్లీ స్థానాలకు 7 పార్లమెంట్ నియోజకవర్గం అభ్యర్థులను ఎంపిక చేసినట్లు తెలిపారు. మిగిలిన స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల రెండవ దశ జాబితాను ప్రకటిస్తామని తెలిపారు. ఈ కార్యవర్గ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిట్టా వరప్రసాద్, కార్యదర్శి గుణవతి, రాష్ట్ర ఉపాధ్యక్షులు జానకిరాం ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.