Visakhapatanam

హైకోర్టును ఆశ్రయించిన రాజధాని రైతులు…

OIP (12)

ప్రభుత్వ కార్యాలయాలను విశాఖపట్నానికి తరలించడంపై ఏపీ హైకోర్టు లో రిట్ పిటిషన్ దాఖలైంది. రాజధాని రైతులు గద్దె తిరుపతిరావు, మాధల శ్రీనివాసరావు, వలపర్ల మనోహర్‌ హైకోర్టును ఆశ్రయించారు. రైతుల తరపున న్యాయవాది ఉన్నం శ్రవణ్‌కుమార్‌ ఈ పిటిషన్ వేశారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి ముసుగులో సీ.ఎం. క్యాంప్, ఇతర మంత్రులు, అధికారులు క్యాంప్ కార్యాలయాలు ఏర్పాటు చేయడంపై అభ్యంతరం తెలిపారు. ఇప్పటికే హైకోర్టు త్రిసభ్య ధర్మాశనం ఇచ్చిన తీర్పులో కార్యాలయాల మార్పు కుదరదని చెప్పిన అంశాన్ని రైతులు గుర్తు చేశారు.

పైగా హైకోర్టు తీర్పులో రిట్ ఆఫ్ మాండమస్ విధించిందని పిటిషన్‌లో పేర్కొన్నారు. హైకోర్ట్ తీర్పుపై ఏ.పీ. ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లినా… స్టే ఇచ్చేందుకు కోర్టు తిరస్కరించిందని రైతులు పేర్కొన్నారు. రాజధాని తరలించడం సాధ్యం కాక.. క్యాంప్ ఆఫీసుల ముసుగులో తరలించే ప్రయత్నం చేస్తున్నారని రైతుల ఆరోపించారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

News Andhra Pradesh Political Anakapalli Srikakulam Visakhapatanam

ముఖ్యమంత్రి YS జగన్‌ అక్టోబర్‌ 16న విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల పర్యటన

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మెహన్‌ రెడ్డి అక్టోబరు 16న విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో పర్యటించనున్నారు. ఇందుకు సంబంధించిన ప్రోగ్రామ్‌ షెడ్యూల్‌ను ప్రభుత్వం జారీ చేసింది. ఉదయం
IMG-20231123-WA0047
Visakhapatanam

విశాఖలో బాధిత మత్స్యకారులకు పవన్ కల్యాణ్ భరోసా ….

విశాఖ ఫిషింగ్ హార్బర్లో జరిగిన అగ్నిప్రమాద సంఘటనా ప్రాంతాన్ని, బాధిత మత్స్యకారులను జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ రోజు (శుక్రవారం) పరామర్శించనున్నారు. అగ్ని ప్రమాద బాధిత