సినీ ఫక్కీలో భారీగా గంజాయిని సెబ్ అధికారులు పట్టుకున్నారు. శృంవరపుకోట మండలం రాజీపేట గ్రామం వద్ద వాహనాలు తనిఖీలు చేస్తుండగా తనిఖీల సమయంలో బొలెరో వాహనాన్ని ఆపకుండా వెళ్లిపోవడంతో అనుమానమోచ్చిన అధికారులు ఆ వాహనాన్నిచేస్ చాశారు. చేజ్ చేసే క్రమంలో తాటిపూడి సమీపాన దొర్లపాలెం గ్రామం వద్ద ఆ వాహనం బోల్తా పడింది. బోల్తా పడిన బొలెరో వాహనంలో భారీగా బయటపడిన గంజాయి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో ఒకరిని అదుపులోకి తీసుకుని, వాహనాన్ని సీజ్ చేసిన కేసు నమోదు చేశారు.