Political

8 రాష్ట్రాలు/యూటీలలో 49 స్థానాలలో నేడు వోటింగ్…

images_1553258750728_140407123723_08_india_elections_2014_horizontal_large_gallery.jpg_thump

ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాలలో 49 స్థానాలను కవర్ చేసే 2024 లోక్‌సభ ఎన్నికల ఐదవ దశకు నేడు ఓటింగ్ జరగుతుంది. ఉత్తరప్రదేశ్ ఓటర్లు దీనికి సిద్ధమయ్యారు. రాయ్‌బరేలీ, అమేథీ, లక్నోతో సహా కొన్ని హై ప్రొఫైల్ నియోజకవర్గాల నుండి కీలక అభ్యర్థుల ఎన్నికల భవితవ్యాన్ని నిర్ణయించబడుతుందని రాజకీచ వర్గాల సామాచారం. ఓటింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6 గంటలకు కొనసాగుతుందని ఈ.సీ. తెలిపింది. ఒడిశాలోని 35 అసెంబ్లీ నియోజకవర్గాలకు కూడా నేడు ఓటింగ్ జరగనుంది. ఇక్కడ అభ్యర్థుల్లో బిజూ జనతాదళ్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఉన్నారు.

49 లోక్‌సభ నియోజకవర్గాల్లో ఉత్తరప్రదేశ్‌ నుంచి 14, మహారాష్ట్ర నుంచి 13, పశ్చిమ బెంగాల్‌ నుంచి 7, బీహార్‌ నుంచి 5, జార్ఖండ్‌ నుంచి 3, ఒడిశా నుంచి 5, జమ్మూ కాశ్మీర్‌, లడఖ్‌ నుంచి ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయి. 2024 లోక్‌సభ ఎన్నికల ఐదో దశలో కాంగ్రెస్‌కు చెందిన రాహుల్ గాంధీ, బీ.జే.పీ. నేతలు రాజ్‌నాథ్ సింగ్, స్మృతి ఇరానీ, రాజీవ్ ప్రతాప్ రూడీ, పీయూష్ గోయల్, ఉజ్వల్ నికమ్, కరణ్ భూషణ్ సింగ్, ఎల్‌.జే.పీ. చీఫ్ చిరాగ్ పాశ్వాన్, జమ్మూ కీలక అభ్యర్థులుగా ఉన్నారు. కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ యొక్క ఒమర్ అబ్దుల్లా, రాష్ట్రీయ జనతాదళ్ నాయకుడు రోహిణి ఆచార్య అభ్యర్ధులుగా నిలబడ్డారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.