ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురవడంతో గురువారం వేడి మరియు తేమతో కూడిన పరిస్థితుల నుండి ఉపశమనం పొందిందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఢిల్లీలోని సరితా విహార్, మునిర్కా, నోయిడా సహా పలు ప్రాంతాల్లో ఉదయం భారీ వర్షాలు కురిశాయని తెలిపింది. గంటకు 20-30 కి.మీ వేగంతో బలమైన గాలులతో పాటు ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతుందని ఐ.ఎం.డీ. ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
ఐ.ఎం.డీ. అధికారి మాట్లాడుతూ… వర్షాల తీవ్రత పెరుగుతుందని అన్నారు. శుక్ర, శనివారాల్లో నగరంలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయన్నారు. జూన్ 30 ఆదివారం నాడు, ఈదురు గాలులతో కూడిన మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు హెచ్చరించారు.