బంగాళాకాతంలో డిశంబర్ 16 న ఒక ఉపరితల అవర్తనం ఏర్పడి అది డిశంబర్ 18 కి అల్పపీడనంగా మారుతుందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల్ల నిర్వాహన సంస్థ వెల్లడించింది. దాని గమనం (దిశ ) శ్రీలంక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ దశగా కొనసాగుతుందని తెలిపింది. ఈ అల్పపీడనం భారీ తుఫాన్ గా ఏర్పడుతుందని హెచ్చరించింది.
ఆంధ్రప్రదేశ్ వైపుగా వచ్చే అవకాశం 50 శాతంగా ఉన్నట్లు తెలిపింది. ఆంధ్రప్రదేశ్ వైపుగా వస్తే డిశంబర్ 21,22,23,24,25 వరకు వర్షాలు కురిసే అవకాశముందని ఈలోపే రైతులు తమ పనులను డిశంబర్ 15 తారీకు లోపల పూర్తి చేసుకోవాలని హెచ్చరించింది.