ఐ.డి.ఎస్.పి. నందు ఖాళీగా ఉన్న ఎసిడెమియాలజిస్ట్ ఉద్యోగాల భర్తీ కొరకు ఒక సంవత్సరం పాటు ఒప్పంద ప్రాతిపదికన జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి పూర్వపు పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు వారి అధీనంలో పనిచేయుటకు అర్హత గల అభ్యర్థుల నుండి దరఖాస్తులు స్వీకరించడం జరిగింది. అందుకు సంబందించిన నియామకాలన్ని ప్రభుత్వం ఆదేశానుసారం వారు ఏర్పాటుచేసిన ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా మాత్రమే జరుపుటకు నిర్ణయించడంజరిగింది.
ఇప్పటికే నోటిఫికేషన్ ఏమైనా ఇచ్చిన యెడల నిలపాలని కమీషనర్, హెల్త్ అండ్ ఫామిలీ వెల్ఫేర్, ఆంధ్రప్రదేశ్, మంగళగిరి వారు ఉత్తర్వులు జారీచేసారు. కావున ఐ.డి.ఎస్.పి. నందు జిల్లా ఎసిడెమియాలజిస్ట్ ఉద్యోగము భర్తీ కొరకు ఇచ్చిన నోటిఫికేషన్ నెం. 1/2024 జిల్లా నియామకపు కమిటీ, ఏలూరు జిల్లా వారు రద్దు పరచుట జరిగినదని అభ్యర్దులు గమనించగలరన్నారు. పూర్తి వివరములు కొరకు ఆన్లైన్లో https://westgodavari.ap.gov.in మరియు https://eluru.ap.gov.in వెబ్ సైట్ ను పరిశీలించగలరన్నారు.