ఎర్రబెల్లి దయాకర్ రావు పార్టీ మారుతారని ఎవరూ చెప్పుకోవడం లేదు కానీ… తాను మాత్రం పార్టీ మారడం లేదని బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటానని మీడియాకు సమాచారం ఇచ్చారు. ఎర్రబెల్లి నుంచి వచ్చిన సమాచారం చూసి జర్నలిస్టులు కూడా ఆశ్చర్యపోయారు. డీఎస్పీ ప్రణీత్ రావు ను సిట్ అధికారులు ట్యాపింగ్ కేసులో ప్రశ్నిస్తున్నారు. ఇందులో ప్రధానంగా ఎర్రబెల్లి దొరికిపోయినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఎర్రబెల్లిపై రేవంత్ రెడ్డికి ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది. అందుకే బిక్కుబిక్కుమంటున్నారని కాంగ్రెస్ వర్గాలంటున్నాయి. ఈ క్రమంలో ఎర్రబెల్లి రక్షణ కోసమైనా బీ.జే.పీ. లో చేరేందుకు ప్రయత్నించాలనుకుంటున్నారని అందుకే.. తనను సంప్రదించేలా.. లీకులు ఇస్తున్నారని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి.
నా మద్దతు ఆ పార్టీకే …!!! -ఎర్రబెల్లి-
![Errabelli](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2024/03/Errabelli.jpg?resize=800%2C700&ssl=1)