IMG-20231107-WA0017 Political

వైసీపీకి తగిన గుణపాఠం చెప్పాలి…

అబద్ధపు హామీలతో అధికారం చేపట్టిన వైసీపీ పాలనలో రాష్ట్ర అభివృద్ధి అగమ్యగోచరంగా తయారయ్యిందని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప తనయుడు రంగనాగ్ పేర్కొన్నారు. బాబు ష్యురిటీ భవిష్యత్తు గారంటీ ప్రచార కార్యక్రమం సామర్లకోట మండలం ఉండూరు లో మంగళవారం సాయంత్రం నిర్వహించారు. టీడీపీ మేనిఫెస్టో పైనా ప్రజలకు వివరించారు. తోటకూర శ్రీను, కుర్రా నారాయణస్వామి, చీకట్లవెంకటేష్, కొప్పిరెడ్డిరాజా, లు పాల్గొన్నారు.*

WhatsApp Image 2023-11-07 at 7.51.34 PM Trending News

ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయండి … -ఆటో వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు తాటిపాక మధు –

రాష్ట్రంలో రవాణా రంగంలో ఆటోలు కీలకపాత్ర వహిస్తున్నాయిని ఉన్నత చదువులు చదివి ఉద్యోగ అవకాశాలు లేక కుటుంబ పోషణ కోసం ఆటోను నడుపుతున్నారని వారందరరకి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ఏ.ఐ.టి.యు.సీ. వుమ్మడి జిల్లా ఉపాధ్యక్షులు , ఆటో వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు తాటిపాక మధు డిమాండ్ చేశారు. ఉద్రజవరం మండలం వడ్లూరు లో శ్రీ రాంమాజేనేయ ఆటో వర్కర్స్ యూనియన్ ఏ.ఐ.టి.యు.సి. అనుబంధం ఆధ్వర్యంలో నూతన శాఖ ఏర్పడింది . ఏ.ఐ.టి.యు.సి. పతకాన్ని తాటిపాక […]

WhatsApp Image 2023-11-07 at 7.50.07 PM Kakinada

ప్రతిపక్ష నాయకులు ప్రభుత్వంపై బురద జల్లడం మానుకోవాలి… -హోం మంత్రి తానేటి వనిత-

రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న ప్రభుత్వం చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్రకు ప్రజల నుంచి అనూహ్య స్పందన రావడంతో ప్రతిపక్షం ప్రభుత్వం బురదజల్లే ప్రయత్నం చేస్తోందని, ప్రతి విషయాన్ని రాజకీయ రంగు పులిమి కుట్రలు చేస్తోందని రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత మండిపడ్డారు. అందులో భాగంగానే విజయవాడ సమీపంలోని కంచికచర్ల రాజీవ్ నగర్ కి చెందిన కాండ్రు శ్యాంకుమార్ ఘటనని వాడుకునే ప్రయత్నం చేస్తోందన్నారు. ఈ ఘటనలో పోలీసులు […]

image_of_a_thief Crime

అంబేద్కర్ కోనసీమ జిల్లా లో బంగారం చోరీకి పాల్పడ్డ దొంగలు…

అంబేద్కర్ కోనసీమ జిల్లా లో కొత్తపేట నియోజకవర్గం మండలం అవిడి గ్రామం లో ధూళి వెంకటేశ్వరరావు , ధూళి సుబ్రహ్మణ్యం ఇళ్ళలో దొంగలు బంగారం చోరీకి చేశారు. ధూళి వెంకటేశ్వరరావు , ధూళి సుబ్రహ్మణ్యం లు ఇంట్లో లేని సమయం చూసి ఆ ముగ్గురు దొంగలు దొంగతనానికి పాల్పడ్డారు. వారు దొంగతనం చేస్తున్న సమయంలో అక్కడ స్థానికలు రావటంతో దొంగలు పారారీ అయ్యారు. అందులో ఒక దొంగను స్థానికులు పట్టుకుని సమీపంలో ఉన్న పోలీసులకు అప్పగించారు. స్థానిక […]

WhatsApp Image 2023-11-07 at 7.14.10 PM Political

జగన్ పాలనలో ఒక్కరు కూడా ఆనందంగా లేరు… -రాష్ట్ర టిడిపి ఉపాధ్యక్షుడు బండారు సత్యానందరావు-

 రాష్ట్రంలో జగన్ పాలనలో ఒక్కరు కూడా ఆనందంగా లేరని, అన్ని ధరలు పెరిగిపోయాయని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు, కొత్తపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ బండారు సత్యానందరావు అన్నారు. కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలం బడుగువానిలంకలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మెర్ల గోపాలస్వామి, క్లస్టర్ ఇన్చార్జ్, జిల్లా రైతు అధికార ప్రతినిధి ఈదల సత్తిబాబు ఆధ్వర్యంలో జరిగిన బాబు షూరిటీ-భవిష్యత్తు గ్యారెంటీ మహా శక్తి చైతన్య రథయాత్ర కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా బండారు పాల్గొన్నారు. నాయకులు, […]

WhatsApp Image 2023-11-07 at 6.59.25 PM Education / Career

విద్యార్థుల్లో విద్యా నైపుణ్యాలను పెంపొందించే విధంగా అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని… -డా. కృతికా శుక్లా-

విద్యార్థుల్లో విద్యా నైపుణ్యాలను పెంపొందించే విధంగా గతంలో పదో తరగతి, ఇంటర్ మీడియట్ ఉత్తీర్ణత కాని విద్యార్థులచే తిరిగి పబ్లిక్ పరీక్షలు రాయించడం లేదా నైపుణ్య శిక్షణ కేంద్రాల్లో చేర్చే విధంగా అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డా. కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ డా‌. కృతికా శుక్లా పాఠశాల విద్యాశాఖ, నైపుణ్య శిక్షణ, ఇంటర్ మీడియట్ అధికారులతో మిషన్ జీ.ఈ.ఆర్. లో భాగంగా 5 సంవత్సరాల […]

WhatsApp Image 2023-11-06 at 10.21.59 PM Political

రాష్ట్రానికి ద్రోహం చేస్తున్న మూడు ప్రధాన పార్టీలు… -సీ.పీ.ఎం. నేతలు లోకనాథం, సీతారాం-

కేంద్రంలోని బీ.జే.పీ. ప్రభుత్వం రాష్ట్రానికి అన్యాయం చేస్తుంటే, రాష్ట్రంలోని అధికార, ప్రతిపక్ష పార్టీలైన వై.సీ.పీ., టీ.డీ.పీ., జనసేనలు ప్రశ్నించకుండా రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నాయని సీ.పీ.ఎం. రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కే లోకనాధం, మంతెన సీతారాంలు ఆవేదన వ్యక్తం చేశారు. సీ.పీ.ఎం, ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రజా రక్షణ భేరి రాష్ట్ర బస్సు యాత్ర కాకినాడ చేరుకుంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… విభజన హామీలు అమలు చేయకుండా, రైతులకు గిట్టుబాటు ధర గురించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు […]

WhatsApp Image 2023-11-06 at 10.03.47 PM Trending News

అక్రిడిటేషన్ తో ప్రమేయం లేకుండా వర్కింగ్ జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలి

అక్రిడిటేషన్‌ తో ప్రమేయం లేకుండా అర్హులైన వర్కింగ్ జర్నలిస్ట్లందరికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని రాష్ట్ర పౌర సమాచార , బీ.సీ. సంక్షేమ శాఖామంత్రి చెల్లిబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణను కాకినాడ ప్రెస్ క్లబ్ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ కోరింది. రామచంద్ర పురంలోని క్యాంప్ కార్యాలయంలో మంత్రిని కలిసి శాలువాతో సన్మానించారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు పీతల అచ్యుతరామారావు, ప్రధాన కార్యదర్శి గునిపే శోభన్ బాబు, ట్రెజరర్ కోనేటి శ్రీనివాస్ రావు, ఎడ్వైజరీ కమిటీ సభ్యులు టీవీ 7 అధినేత వీది […]

WhatsApp Image 2023-11-06 at 9.42.35 PM Political

చంద్ర బాబుతోనే ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు…

సామర్లకోట రూరల్ మండలం పి. వేమవరం గ్రామం నందు పెద్దాపురం శాసనసభ్యుడు నిమ్మకాయల చినరాజప్ప తనయుడు నిమ్మకాయల రంగనాగ్ సామర్లకోటలో బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు ప్రతి ఇంటికీ వెళ్లి వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు తామెదుర్కొంటున్న సమస్యలను చెప్పుకొచ్చారు. త్వరలో టీడీపీ ప్రభుత్వం ఏర్పడుతుందని మినీ మేనిఫెస్టో వల్ల ప్రజలకు కలిగే ప్రయోజనాలను వివరించారు.

WhatsApp Image 2023-11-06 at 9.25.56 PM Political

44 ప్లాస్టిక్ బ్యాగ్ లలో 2670 కేజీల PDS బియ్యం స్వాధీనం…

కాకినాడ సిటీ సంజయ్ నగర్‌ కాలనీలోని ఒక ఇంటిలో బియ్యం అక్రమ నిల్వ ఉండడాన్ని గమనించిన విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. విజిలెన్స్ అధికారులు, రెవెన్యూ మరియు సివిల్ సప్లయ్స్ అధికారులతో కలిసి ఒక ఇంటిని తనిఖీ చేయగా 22 ప్లాస్టిక్ బ్యాగ్ లలో సుమారు 1359 కేజీల PDS బియ్యంను, ఇంటి ఆవరణలో గల ఒక వాహనములో 22 ప్లాస్టిక్ బ్యాగ్ లలో 1311 కేజీల PDS బియ్యంను మొత్తం వెరసి […]