hqdefault (1) Kakinada

ముంపు కుటుంబాలకు ఎస్కే బాయ్స్ సహాయం…

మీచౌంగ్ తుఫాను ప్రభావంతో ముంపునకు గురైన కుటుంబాలకు సామర్లకోట కు చెందిన ఎస్కే బాయ్స్ ఆధ్వర్యంలో కూరగాయలు, కిరాణా సామాగ్రి పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. సామర్లకోట పట్టణంలో 31వ వార్డు భాస్కర్ కాలనీలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కాలనీలో పలు వీదుల్లో గృహాల వద్దకు నీరు చేరింది. దానితో వార్డు కౌన్సిలర్ పాగా సురేష్ కుమార్ దానిపై స్పందించారు. దానితో ఆయన సహకారంతో భాదిత కుటుంబాలకు వారం రోజులకు సరిపడా కూరగాయలు, […]

WhatsApp Image 2023-12-04 at 7.53.42 PM Weather

మిచాంగ్ తుపాన్ తో విద్యాసంస్థలకు సెలవు…

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా మిచాంగ్ తుపానుగా మారి ఈదురుగాలులు, భారీవర్షాల కారణంగా సామర్లకోటమండలం, పట్టణ పరిధిలో అన్నిప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలను మూసివేశారు. ఈమేరకు విద్యా శాఖ ఆర్జేడీ నాగమణి నుంచి ఎం.ఈ.వో. కార్యాలయాలకు ఉత్తర్వులు అందాయి. కాగా మంగళవారంకూడా తుపాన్ ప్రభావం ఉన్నందున మంగళ వారం కూడా విద్యాసంస్థలకు సెలవు ప్రకటించినట్లు ఆర్జేడీ నాగమణి సాయంత్రం వెల్లడించారు.

WhatsApp Image 2023-12-01 at 3.06.56 PM Knowledge

మహిళల రక్షణ చట్టాలపై అవగాహన అవసరం… -పెద్దాపురం డీ.ఎస్.పీ.-

మహిళల రక్షణ చట్టాలపై నేటి యువతీ యువకులకు అవగాహన అవసరమని పెద్దాపురం డీ.ఎస్.పీ. లతా కుమారి అన్నారు. సామర్లకోట ప్రగతి మహిళ డిగ్రీ కళాశాల లో ఇన్నర్ వీల్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో డీ.ఎస్.పీ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా డీ.ఎస్.పీ మాట్లాడుతూ… నేటి సమాజంలో విద్యార్థులు తమను తాము ఎలా కాపాడుకో, ఆటోలు, బస్సుల్లో ఒంటరిగా ప్రయాణించేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించారు. కొంతమంది ప్రజలు సైబర్ నేరాల బారిన పడి […]

WhatsApp Image 2023-11-29 at 5.27.48 PM Exclusive

సామర్లకోట భీమేశ్వర ఆలయం ఈ.వో. గా సూర్యనారాయణ…

పంచారామ క్షేత్రం సామర్లకోట శ్రీ కుమారా రామ భీమేశ్వరాలయం ఇంచార్జి కార్య నిర్వహణా అధికారిగా కాండ్రకోట ఆలయ ఈ.వో. గా పనిచేస్తున్న టీ. వెంకట సూర్యనారాయణకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ దేవాదాయ ప్రాంతీయ కమీషనర్ సురేష్ బాబు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో సామర్లకోట ఆలయం చేరుకుని టీవీ సూర్యనారాయణ భాద్యతలు చేపట్టారు.

WhatsApp Image 2023-11-28 at 5.11.42 PM Political

సంక్షేమం అందించే ప్రభుత్వం కోసం ఆలోచించండి… -హౌసింగ్ చైర్మన్-

ఇప్పటి వరకు ఉన్న ప్రభుత్వాల్లో ప్రజలకు నిజంగా సంక్షేమం అందించిన ప్రభుత్వం ఏమిటో ఆలోచించి రానున్న ఎన్నికల్లో ఆ ప్రభుత్వాన్ని ఆదరించాలని రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్, పెద్దాపురం నియోజక వర్గ వై.సీ.పీ. ఇంఛార్జి దవులూరి దొరబాబు అన్నారు. సామర్లకోట మండలం ఉండూరు గ్రామంలో రూ. 1.70 కోట్లతో నిర్మించిన సచివాలయం, వెల్నెస్ సెంటర్, రైతు భరోసా కేంద్రాల సముదాయాన్ని హౌసింగ్ చైర్మన్ దొరబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎం.పీ.పీ. బొబ్బరాడ సత్తిబాబు అధ్యక్షతన జరిగిన సభలో […]