toe-tag-body Crime

అవుట్ సోర్సింగ్ ఉద్యోగి ఢీ కొట్టిన వాహనం…

సామర్లకోట పట్టణంలో ధారుణ ఘటన చోటు చేసుకుంది. సామర్లకోట మునిసిపల్ అవుట్ సోర్సింగ్ మిర్యాల రాజు(35) గుర్తు తెలియని వాహనం వేగంగా ఢీ కొట్టి అక్కడినుంచి వెళ్లిపోయింది. ఆయన విధ నిర్వహణలో భాగంగా పెద్దాపురంలో మోర్ మార్కెట్ ఎదురుగా రోడ్లు శుభ్రపరిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ ప్రమాదంలో అతనకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అక్కడ స్థానికులు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ… మృతి చెందాడు. ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాపతు చేస్తునట్లు […]

WhatsApp Image 2023-12-27 at 4.41.20 PM Exclusive

వై.ఎస్.ఆర్.సీ.పీ. ఇంచార్జ్ ఇంటి వద్ద అంగన్వాడీలు నిరసన…

అంగన్ వాడీలు తమ న్యాయమయిన సమస్యలను నెరవేర్చమని గత 15 రోజులుగా సమ్మె చేస్తున్నారు. అయిన ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని అంగన్వాడీ యూనియన్ నేతలు మండిపడ్డారు. మంత్రి బొత్స సత్యనారాయణ, అధికారుల బృందంతో చర్చలు విఫలం అయ్యాయన్నారు. ‘ఇప్పటి వరకు నాలుగు సార్లు చర్చలు జరిపారు కానీ మా డిమాండ్స్ పై సానుకూలంగా స్పందించడంతో రాష్ట్రంలో అధికార వై.సి.పి.కి. చెందిన ఎమ్మెల్యేలు, ఇన్చార్జిల ఇంటివద్ద నిరసనకు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా పెద్దాపురం నియోజవర్గం వైఎస్ఆర్సిపి ఇంచార్జ్ […]

WhatsApp Image 2023-12-27 at 12.13.59 PM Viral

దవులూరి ఇంటి దగ్గర అంగన్ వాడీల నిరసన…

రాష్ట్రంలో అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర హౌసింగ్‌ కార్పోరేషన్‌ ఛైర్మన్‌, పెద్దాపురం వైఎస్‌ఆర్‌సీ పార్టీ ఇంఛార్జి దవులూరి దొరబాబు ఇంటి వద్ద సీ.ఐ.టీ.యూ. జిందాబాద్ అని అంగన్‌వాడీ వర్కర్లు నిరసన వ్యక్తంచేసారు. సమస్యలను చేప్పడానికి వచ్చిన తమను వెనక్కి పంపడం అన్యాయమని ఆందోళన వ్యక్తం చేసారు.

hqdefault (1) Kakinada

ముంపు కుటుంబాలకు ఎస్కే బాయ్స్ సహాయం…

మీచౌంగ్ తుఫాను ప్రభావంతో ముంపునకు గురైన కుటుంబాలకు సామర్లకోట కు చెందిన ఎస్కే బాయ్స్ ఆధ్వర్యంలో కూరగాయలు, కిరాణా సామాగ్రి పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. సామర్లకోట పట్టణంలో 31వ వార్డు భాస్కర్ కాలనీలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కాలనీలో పలు వీదుల్లో గృహాల వద్దకు నీరు చేరింది. దానితో వార్డు కౌన్సిలర్ పాగా సురేష్ కుమార్ దానిపై స్పందించారు. దానితో ఆయన సహకారంతో భాదిత కుటుంబాలకు వారం రోజులకు సరిపడా కూరగాయలు, […]

212106-police Exclusive

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో 14 మందికి జరిమానా విదించిన కోర్టు…

మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 14 మందికి పెద్దాపురం కోర్టు ఒక్కొక్కరికి రూ. 40 వేలు వంతున జరిమానా విధించిందని జగ్గంపేట సీఐ లక్ష్మణరావు తెలిపారు. గత నవంబర్లో జగ్గంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించి పోలీసులు 14 మంది మీద కేసులు నమోదు చేశామన్నారు. నిందితులను కోర్టులో హాజరు పరచగా 14 మందికి జరిమానా, ఒక వ్యక్తికి రెండు రోజులు జైలు శిక్ష విధించారని చెప్పారు.

IMG-20231116-WA0043 Culture

రాష్ట్ర బాస్కెట్ బాల్ జట్టుకు కిరణ్ రాజ్ ఎంపిక…

రాష్ట్ర బాస్కెట్ బాల్ జట్టుకు సామర్లకోట ప్రగతి స్కూల్ చెందిన సీ.హెచ్. కిరణ్ రాజ్ ఎంపికయ్యాడని ప్రగతివిద్యాసంస్థల చైర్మన్ నూతలపాటి పూర్ణచంద్రరావు, నూతలపాటి హిమబిందులు చెప్పారు. చిత్తూరుజిల్లా మదనపల్లిలో ఇటీవల జరిగిన అండర్ 14 విభాగంలో స్కూల్ డిస్ట్రిక్ట్ బాస్కెట్ బాల్ పోటీలలో జిల్లా జట్టు విజయం సాధించడంలో కిరణ్ రాజ్ అత్యద్భుత ప్రతిభ కనబరిచి రాష్ట్ర జట్టుకు ఎంపికయ్యాడన్నారు. కిరణ్ రాజ్ ను అభినందించారు.

IMG-20231107-WA0017 Political

వైసీపీకి తగిన గుణపాఠం చెప్పాలి…

అబద్ధపు హామీలతో అధికారం చేపట్టిన వైసీపీ పాలనలో రాష్ట్ర అభివృద్ధి అగమ్యగోచరంగా తయారయ్యిందని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప తనయుడు రంగనాగ్ పేర్కొన్నారు. బాబు ష్యురిటీ భవిష్యత్తు గారంటీ ప్రచార కార్యక్రమం సామర్లకోట మండలం ఉండూరు లో మంగళవారం సాయంత్రం నిర్వహించారు. టీడీపీ మేనిఫెస్టో పైనా ప్రజలకు వివరించారు. తోటకూర శ్రీను, కుర్రా నారాయణస్వామి, చీకట్లవెంకటేష్, కొప్పిరెడ్డిరాజా, లు పాల్గొన్నారు.*

WhatsApp Image 2023-11-02 at 9.53.08 PM Political

గృహ నిర్మాణాలపై మంత్రి సమీక్ష…

  నిర్మాణ్ భవన్ లో అన్ని జిల్లాల హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ల తో గృహ నిర్మాణ శాఖా మంత్రి జోగి రమేష్, ఆంధ్రరాష్ట్ర గృహనిర్మాణ సంస్థ చైర్మన్, పెద్దాపురం నియోజకవర్గ వై.ఎస్. ఆర్ సీపీ ఇంచార్జ్ దవులూరి దొరబాబు, ప్రిన్సిపల్ సెక్రెటరీ అజయ్ జైన్ సమావేశమై గృహ నిర్మాణ కార్యక్రమంపై చర్చించారు. ఇంకా నిర్మాణంలో ఉన్న దృహాలను త్వరగా పూర్తి చేసేందుకు అన్ని విధాలా చర్యలు తీసుకోవాల్సిందిగా ఆయన సూచించారు.