ఈ నెల 3వ తారీఖున ఉప్పలగుప్తం మండలం ఎన్. కొత్తపల్లి గ్రామం నందు దొరికిన గుర్తుతెలియని ఆడ శిశువును 10 రోజుల చికిత్స అనంతరం గౌరవ C.W.C. రాజమండ్రి వారి ఆదేశాల మేరకు, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, ప్రాజెక్ట్ డైరెక్టర్ జి.వి. సత్యవాణి గారి ఆధ్వర్యంలో శిశువును అమలాపురం ఏరియా ఆసుపత్రి నుంచి కాకినాడలో ఉన్న “శిశు గృహా” నకు అప్పజెప్పడం జరిగినది. అలాగే ఈ పాపకు సంబంధించిన రక్తసంబంధీకులు గానీ, బంధువులు గాని ఎవరైనా ఉన్నచో, వారు తగిన ఆధారాలతో కాకినాడలో ఉన్న శిశు గృహకు వెళ్లాలని, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, ప్రాజెక్ట్ డైరెక్టర్ జీ.వి. సత్యవాణి గారు తెలియజేయడం జరిగినది.
కాకినాడ శిషుగృహకు చేరిన ఉప్పలగుప్తం శిశువు
![IMG-20231115-WA0004](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2023/11/IMG-20231115-WA0004.jpg?resize=1280%2C700&ssl=1)