సిడ్నీలో అస్సిరియన్ చర్చి బిషప్, కొంతమంది అనుచరులపై కత్తితో దాడి చేయడం అనుమానిత మతపరమైన తీవ్రవాదంతో ప్రేరేపించబడిన ఉగ్రవాద చర్య అని ఆస్ట్రేలియా పోలీసులు మంగళవారం తెలిపారు. ఒక యువకుడు కత్తితో అతనిపైకి దూసుకెళ్లడంతో బిషప్ మార్ మారి ఇమ్మాన్యుయేల్‌తో సహా కనీసం నలుగురు వ్యక్తులు గాయలు అయ్యాయని తెలిపారు.
15 ఏళ్ల మగ దుండగుడు కత్తితో తన ఇంటికి దూరంగా ఉన్న చర్చికి వెళ్లడంతో ముందస్తు ఆలోచన ఉందని పోలీసులు తెలిపారు. వారు నా ప్రవక్తను అవమానించకుంటే, నేను ఇక్కడికి వచ్చేవాడిని కాదు అని అరబిక్‌లో తనను అడ్డుకున్న చర్చికి వెళ్లేవారితో ఆ బాలుడు చెప్పినట్లు టెన్ నెట్వర్క్ నివేదించింది.