భారతదేశంలో iQOO సంస్థ తన iQOO నియో 9 ప్రో మొబైల్‌ని ఫిబ్రవరి 22న లాంచ్ చేయ్యనున్నట్లు వెళ్లడించింది. ఈ స్మార్ట్‌ఫోన్ క్వాల్ కం స్నేప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ తో పాటు ప్రీమియం లెదర్ ఫినిషింగ్ మరియు డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుందని కంపెనీ ధృవీకరించింది. భారతదేశంలో ఈ స్మార్ట్‌ఫోన్ అమెజాన్, iQOO అధికారిక వెబ్సైట్లో రానున్నట్లు తెలిపింది.
స్మార్ట్‌ఫోన్ USB టైప్-సి పోర్ట్, స్పీకర్ గ్రిల్స్, దిగువన ప్రైమరీ మైక్రోఫోన్‌తో వస్తుందని వెల్లడించింది. iQOO నియో 9 ప్రో ఇప్పటికే చైనాలో ప్రారంభమైందని అదే స్పెసిఫికేషన్లతో భారత దేశంలో కూడా వస్తుందని తెలిపారు. దీని ధర దాదాపు రూ. 40,000 ఉండవచ్చని అంచనా.